– మరో రెండ్రోజుల పాటు అవకాశం కల్పించిన టీఎస్పీఎస్సీ
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: Group-1 ఉద్యోగ నియామక పరీక్షకు దరఖాస్తుల గడువును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పొడిగించింది. అభ్యర్థులకు మరో రెండు రోజులపాటు అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 Group-1 పోస్టుల భర్తీకి గత నెల 19న నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 23 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. బుధవారం వరకు 2.7 లక్షలకు పైగా దరఖాస్తులు అందినట్టు TSPSC తెలిపింది. షెడ్యూల్ ప్రకారం గురువారం సాయంత్రం 5 గంటలకు గడువు ముగియడంతో.. మరో రెండ్రోజుల పాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఇంకా దరఖాస్తు చేసుకోని వారు ఆన్‌లైన్ https://www.tspsc.gov.in/ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. Group-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21నుంచి నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.