TSPSC Group 1 : తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ఫలితాలు (TSPSC Group 1) విడుదలయ్యాయి. గ్రూప్ 1 ఫలితాలను టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం విడుదల చేసారు. రాష్ట్రంలో 563 ఉద్యోగాలకు టీజీపీఎస్సీ పరీక్ష నిర్వహించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను tspsc.gov.in అధికారిక వెబ్‌సైట్ నుండి తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే గ్రూప్ 2 ఫలితాలను కూడా రేపు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20 లోపు అన్ని పోటీపరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి అని వెల్లడించారు.