HomeతెలంగాణTSPSC : త్వరలో ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

TSPSC : త్వరలో ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

TSPSC : త్వరలో ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

TSPSC : రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాల తర్వాత గ్రూప్​ -1 నోటిఫికేషన్​ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

కొత్త జోన్ల విధానానికి ఆమోదం రావడం, ఉద్యోగుల విభజన ప్రక్రియ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నారు.

11 ఏండ్ల నుంచి పెండింగ్​లో ఉన్న గ్రూప్​ -1 పోస్టులకు ముందుగా నోటిఫికేషన్​ రానుంది.

ఈ మేరకు తెలంగాణ పబ్లిక్​ సర్వీసు కమిషన్​కు కూడా సూచనలు జారీ చేశారు.

గ్రూప్​ -1 నోటిఫికేషన్​కు సంబంధించిన కొన్ని అంశాలను సూచిస్తూ టీఎస్​పీఎస్సీకి సిద్ధంగా ఉండాలంటూ సీఎం కేసీఆర్​ నుంచి ఆదేశాలు అందినట్లు విశ్వసనీయ సమాచారం.

Telangana Movement : తెలంగాణ ఉద్యమం మరోసారి నెమరేద్దాం.. పార్ట్​ 1

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2009 ‌‌- 2

అయితే పోస్టుల జాబితా అందిన తర్వాత నెల నుంచి నెలన్నర రోజుల వరకు సమయం తీసుకుని నోటిఫికేషన్​ వేసేందుకు సిద్ధంగా ఉన్నామని టీఎస్​పీఎస్సీ తరుపున సీఎం కేసీఆర్​కు వివరించినట్లు తెలుస్తోంది.

ఇలా ముందుగా గ్రూప్​ -1 నోటిఫికేషన్​ ఇచ్చి.. వచ్చే ఏడాది వరకు గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, ఇతర కేటగిరీల్లోని దాదాపు 3 వేలకుపైగా పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం.

మల్టీ జోన్‌ పరిధి పోస్టులు, సర్వీసు నిబంధనల మేరకు రోస్టర్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌లను ప్రభుత్వ శాఖలు ఖరారు చేశాయి.

పదకొండేళ్ల తర్వాత

రాష్ట్రంలో కీలకమైన గ్రూప్‌-1 పోస్టులకు జోన్లు, ఇతర సమస్యల కారణంగా ఇప్పటి వరకు నోటిఫికేషన్​ జారీ కాలేదు.

2011లో చేపట్టిన గ్రూప్‌-1 నియామకాలే ఆఖరు.

2014లో తెలంగాణ ఏర్పాటయ్యాక వీటితోపాటు గ్రూప్‌-2, 3 వంటి పోస్టుల భర్తీకి కూడా జోన్లను అడ్డు చూపించారు.

ఫలితంగా నోటిఫికేషన్లు ఆగిపోయాయి.

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2010 ‌‌- 3

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2011 ‌‌- 4

కానీ, గతంలో గ్రూప్​ -1 ఉద్యోగాల భర్తీలో చాలా జాప్యం జరిగింది.

2011లో జారీ చేసిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో ప్రకటించిన 312 పోస్టుల్లో తెలంగాణకు 140 పోస్టులు వచ్చాయి.

అందులో 2007 గ్రూప్‌-1కు సంబంధించిన 13 పోస్టులను అప్పటి అభ్యర్థులకు ఇవ్వాలని కోర్టు మరో తీర్పు ఇచ్చింది.

దీంతో 140 పోస్టుల్లో 13 పోస్టులు తొలగించి 127 పోస్టులకు 2016 సెప్టెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించి, నియామకం చేసుకుంది.

అయితే, ఈసారి జాప్యం లేకుండా చేయాలని టీఎస్​పీఎస్సీ భావిస్తోంది.

కొత్త జోనల్​ విధానం ప్రకారం అన్నీ క్లియర్​ చేసిన తర్వాతే నోటిఫికేషన్లకు సిద్ధమవుతామంటూ టీఎస్​పీఎస్సీ వర్గాలు వెల్లడించాయి.

పెరుగుతున్న గ్రూప్​ -1 పోస్టులు

తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీ ద్వారా గ్రూప్‌-1, 2, 3 పోస్టులు, మల్టీ జోనల్‌ పోస్టుల భర్తీకి కసరత్తు చేసింది.

సబ్జెక్టు నిపుణులతో కమిటీలను ఏర్పాటు చేసి సిలబస్‌ను రూపొందించింది.

2015లో భర్తీ కోసం గ్రూప్‌-1లో 142 పోస్టులను, గ్రూప్‌-2లో 60 పోస్టులను, గ్రూప్‌-3లో 400 వరకు పోస్టులను గుర్తించింది.

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2012 ‌‌- 5

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2013 ‌‌- 6

కానీ రాష్ట్రపతి ఉత్తర్వుల అంశంలో వివాదాల నేపథ్యంలో నోటిఫికేషన్​ ఇవ్వలేదు.


ఈసారి గ్రూప్​-1 పోస్టులు దాదాపు 600 వరకు ఉండే అవకాశం ఉంది.

అయితే వీటిలో ముందుగా 370 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కానీ ఇప్పటి వరకు డీఎస్పీ, ఆర్డీఓ, ఆర్టీఓ, ఎంపీడీఓ, సీటీఓ, డీఆర్​, ఎంపీడీఓ, ఐసీడీఎస్ వంటి శాఖల్లో దాదాపు ఆరు వందల పోస్టులను గుర్తించినట్లు అధికారిక వర్గాల సమాచారం.

ఇందులో డీఎస్పీ 100, ఆర్డీఓ 90, ఎంపీడీఓ 100, డీఆర్​లు 20, ఆర్టీఓలు 40 వరకు, కమర్షియల్​ ట్యాక్స్​లో సీటీఓలు, ఐసీడీఎస్​లో మరిన్ని పోస్టులు, ఇతర విభాగాల్లో కలుపుకుని సుమారు 600 వరకు గ్రూప్​ -1 పోస్టులను ప్రాథమికంగా గుర్తించారు.

2011 నుంచి భర్తీ లేకపోవడంతో పోస్టుల సంఖ్య పెరిగినట్లు భావిస్తున్నారు.

కాగా ఇటీవల టీఎస్​పీఎస్సీతో సీఎం కేసీఆర్​ నోటిఫికేషన్లపై చర్చించినట్లు తెలుస్తోంది.

ముందుగా గ్రూప్​ -1 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించినట్లు అధికారవర్గాల్లో టాక్​.

అయితే శాఖల వారీగా జాబితా అందిన తర్వాత నెలన్నర రోజుల్లో నోటిఫికేషన్​ వేసేందుకు సిద్ధమే అని టీఎస్​పీఎస్సీ కూడా సీఎంకు వివరించినట్లు తెలిసింది.

ఈ లెక్కన మార్చిలో బడ్జెట్​ సమావేశాల తర్వాత గ్రూప్​ -1 నోటిఫికేషన్​ వచ్చే అవకాశాలున్నాయి.

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2014 ‌‌- 7

తెలంగాణ ఉద్యమం సంక్షిప్త సమాచారం – 8

తెలంగాణ ఉద్యమం సంక్షిప్త సమాచారం – 9

Recent

- Advertisment -spot_img