ఇదేనిజం, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆర్టీసీ తాజాగా ఈ స్కీమ్ లో ఈ ట్విస్ట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం మేడారం జాతర ఉన్న సందర్భంగా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్పెషల్ బస్సుల్లో ఫ్రీ జర్నీని బంద్ చేయబోతున్నట్టు సమాచారం. అంతేకాక మేడారం జాతరకు వెళ్లే స్పెషల్ బస్సుల్లో టికెట్ల ధరలను పెంచబోతున్నారు. కాగా ఆర్టీసీ నిర్ణయం పట్ల మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని బస్సుల్లో ఫ్రీ జర్నీ అని తొలుత చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రాగానే సూపర్ లగ్జరీ, ఎసీ బస్సులకు ఈ సౌకర్యం లేదని తేల్చింది. తాజాగా స్పెషల్ బస్సులకు కోత పెట్టనుండటంతో మహిళలను నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది.