HomeతెలంగాణTSRTC : అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ Good News

TSRTC : అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ Good News

అయ్యప్ప భక్తులకు టీఎస్​ ఆర్టీసీ గుడ్​ న్యూస్​ చెప్పింది.శబరిమల దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. శుక్రవారం నుంచి ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం శబరి వెళ్లేందుకు భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్ నుంచి శబరిమల వెళ్లేందుకు ఓ ప్రయాణికుడికి రూ.13,600 ధరగా నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ప్యాకేజీలో భాగంగా అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం కూడా అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 5న ‘లహరి’ బస్సు ఎంజీబీఎస్ నుంచి బయలుదేరుతుందని వివరించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఎంజీబీఎస్ నుంచి బయలుదేరుతుంది.

Recent

- Advertisment -spot_img