Homeహైదరాబాద్latest NewsTSRTC : మేడారం భక్తులకు ఆర్టీసీ మరో Good News

TSRTC : మేడారం భక్తులకు ఆర్టీసీ మరో Good News

రెండేండ్లకోసారి జరిగే మేడారం జాతరకు వెళ్లేందుకు చాలా మంది భావిస్తుంటారు. అయితే వివిధ కారణాల వల్ల కొంతమందికి జాతీరకు వెళ్లడం వీలు కాకపోవచ్చు. వారి కోసం ఆర్టీసీ గుడ్​ న్యూస్​ చెప్పింది. మేడారం జాతరకు వెళ్లకపోయినా ప్రసాదాన్ని ఆన్​ లైన్​ లో బుక్​ చేసుకొనే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు దేవాదాయశాఖతో సంస్థ లాజిస్టిక్స్‌ విభాగం ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో ఆర్టీసీకి చెందిన అన్ని కార్గో (లాజిస్టిక్స్‌) కౌంటర్లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని, బస్‌డిపోల పరిధిలో విధులు నిర్వహించే మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లనూ సంప్రదించవచ్చని సూచించింది. ఈ నెల 14 నుంచి 25 వరకు మేడారం జాతర ప్రసాదాన్ని బుక్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. పూర్తివివరాలకు 040 69440000 నంబర్‌లో సంప్రదించాలని సూచించింది.

Recent

- Advertisment -spot_img