తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో కొన్ని చోట్ల సీట్ల కొట్లాటలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా 1,500 ఎక్స్ ప్రెస్ , ఆర్డినరీ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. బ్యాంకు రుణం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. జూలై నాటికి 450 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.