TTD Darshanam online Tickets available from today : నేడు టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల.. శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త అందించింది.
నేడు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనుంది.
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను శుక్రవారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నది.
నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి రోజుకు 12 వేల చొప్పున టికెట్లను అందుబాటులో ఉంచనుంది.
అదేవిధంగా ఈనెల 23న (శనివారం) నవంబర్ నెలకు సంబంధించిన సర్వదర్శనం టికెట్లు విడుదల చేయనుంది.
రోజులకు 10 వేల చొప్పున సర్వదర్శనం టికెట్లను అందుబాటులో ఉంచనుంది.
సర్వదర్శనం టికెట్లను కూడా ఆన్‌లైన్‌లోనే విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో శ్రీనివాసం కాంప్లెక్స్‌లో ఆఫ్‌లైన్ టికెట్ కౌంటర్‌ను మూసివేశారు.