Homeఆంధ్రప్రదేశ్#TTD : తిరుమల శ్రీవారి హుండీకి మళ్లీ రికార్డ్ ఆదాయం

#TTD : తిరుమల శ్రీవారి హుండీకి మళ్లీ రికార్డ్ ఆదాయం

Tirumala visited by 46,928 people. Again several days later Srivari hundi income increased. Devotees will be taken 20,000 Sarvadarshan tokens daily at Alipiri.
స్వామివారిని 46,928 మంది దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మళ్లీ చాలా రోజుల తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం పెరిగింది. అలిపిరి వద్ద నిత్యం భక్తులకు 20 వేల సర్వదర్శనం టోకెన్లు ఇవ్వనున్నారు.
తిరుమల శ్రీవారికి మళ్లీ భారీ ఆదాయం వచ్చింది. గురువారం భక్తుల రద్దీ కొనసాగగా.. స్వామివారిని 46,928 మంది దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
21,159 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి రూ.3.15 కోట్లు ఆదాయం వచ్చినట్టు టీటీడీ తెలిపింది.
మళ్లీ చాలా రోజుల తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం పెరిగింది. తిరుమలలో 11న పురంధరదాసు ఆరాధనోత్సవాలు.. 19న రథసప్తమి వేడుకలు జరగనున్నాయి.
అలిపిరి వద్ద నిత్యం భక్తులకు 20 వేల సర్వదర్శనం టోకెన్లు ఇవ్వనున్నారు.
కరోనా ప్రభావంతో స్వామివారి హుండీ ఆదాయం బాగా తగ్గిపోయింది.
కరోనా కట్టడి కావడంతో పాటూ పరిస్థితుల్లో మార్పు రావడంతో తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది.. హుండీ ఆదాయం కూడా పెరుగుతోంది.
టీటీడీ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. క్రమంగా భక్తుల సంఖ్యను పెంచుతోంది.
రూ.300 ప్రత్యేక దర్శనంతో పాటూ సర్వ దర్శనం టోకెన్లు కూడా జారీ చేస్తుండటంతో.. భక్తుల సంఖ్య పెరిగింది.

Recent

- Advertisment -spot_img