HomeరాజకీయాలుTTDP : Kasani in tears TTDP : కంటతడి పెట్టుకున్న కాసాని

TTDP : Kasani in tears TTDP : కంటతడి పెట్టుకున్న కాసాని

– ఎన్నికల్లో పోటీకి అధిష్ఠానం నిరాకరం

– పార్టీలో శ్రేణులతో సమాశం

– పోటీ చేయాల్సిందేనని పట్టుబట్టిన నేతలు

– తీవ్ర భావోద్వేగానికి లోనైనా టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్

ఇదేనిజం, తెలంగాణబ్యూరో : తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదని కాసాని జ్ఞానేశ్వర్​ భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్టీఆర్​ భవన్​లో ఆదివారం ఆయన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అధిష్ఠానం నిరాకరించినట్లు పార్టీ శ్రేణులకు తెలిపారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఈ క్రమంలో కాసాని జ్ఞానేశ్వర్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మరోసారి అధిష్ఠానం దృష్టికి నేతల అభిప్రాయాన్ని తీసుకెళ్తానన్నారు. పార్టీనే నమ్ముకుని ఉంటున్న తమకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కకపోవడం బాధాకరమని పలువురు పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు.

Recent

- Advertisment -spot_img