HomeతెలంగాణTummala Nageshwar rao:తుమ్మల దారెటు? టీడీపీ, బిజెపి?

Tummala Nageshwar rao:తుమ్మల దారెటు? టీడీపీ, బిజెపి?

Tummala Nageshwar Rao:

ఉమ్మడి ఖమ్మం జిల్లా గురించి చెప్పుకోవాల్సి వస్తే ముందుగా ప్రస్తావించాల్సింది మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురించి. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొలి రోజుల్లోనే ఆయన పిలుపు మేరకు పార్టీలో చేరిన తుమ్మల నాగేశ్వరరావు అనతి కాలంలోనే జిల్లాలో ప్రభావవంతమైన లీడర్‌గా ఎదిగారు. వామపక్షాల ప్రభావం అధికంగా ఉన్న జిల్లాలోనూ తనదైన శైలిలో రాజకీయాలు నిర్వహించి తెలుగుదేశం పార్టీకి పట్టు దక్కేలా చేశారు. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageshwar Rao).. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు మంత్రివర్గాల్లో పనిచేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పిలుపుమేరకు గులాబీ పార్టీలో చేరారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా లేని తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageshwar Rao)ను ఏకంగా మంత్రిని చేశారు కేసీఆర్. ఆ తర్వాత ఎమ్మెల్సీగా చేసి మంత్రివర్గంలో కొనసాగేలా చూసుకున్నారు. కానీ, 2016లో పాలేరు నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాంరెడ్డి వెంకట్ రెడ్డి ఆకస్మికంగా మరణించడంతో ఖాళీ అయిన నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు తుమ్మల నాగేశ్వరరావు. 2018 వరకు మంత్రిగా కొనసాగిన తుమ్మల నాగేశ్వరరావు.. అదే సంవత్సరం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచే మళ్లీ పోటీ చేసి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి చేతిలో అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. తుమ్మలపై గెలిచిన ఉపేందర్ రెడ్డి ఆ తర్వాత కాలంలో కేసీఆర్ పార్టీలో చేరిపోయారు. దాంతో తుమ్మల నాగేశ్వరరావు హవా ఆ నియోజకవర్గంలో క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఆయన కూడా క్రియాశీల రాజకీయాల నుంచి కొంత విరామం తీసుకున్నట్లుగా కనిపించింది.

పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ

తాజాగా నవంబర్ నెలలో తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గంలో తన సామాజిక వర్గం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పాలేరు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. తుమ్మలపై గెలిచిన ఉపేందర్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. సిట్టింగులందరికీ మళ్ళీ అవకాశం కల్పిస్తానని కెసిఆర్ ఇటీవలనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageshwar Rao) తానే పాలేరులో పోటీ చేస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది. అయితే ఆయన బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోటీ చేస్తారా లేక మరేదైనా పార్టీలో చేరి బరిలోకి దిగుతారా అన్నది తేలలేదు. ఇందులో ఏదైనా జరగవచ్చన్న చర్చ తుమ్మల కామెంట్ల తర్వాత జోరందుకున్నాయి. కేసీఆర్ టిక్కెట్ ఇవ్వకపోతే, ఇండిపెండెంటుగా కూడా ఆయన బరిలో వుండవచ్చన్న అంచనాలు మొదలయ్యాయి. ఈ చర్చ అలా కొనసాగుతుండగానే తాజాగా జనవరి ఒకటవ తేదీన తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageshwar Rao) మరోసారి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఒక్క పాలేరు నియోజకవర్గం మాత్రమే కాకుండా జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి తన అనుచరవర్గాన్ని అంతా ఆహ్వానించి తన బలాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు తుమ్మల నాగేశ్వరరావు. కేసీఆర్‌ను ఒప్పించి బీఆర్ఎస్ టిక్కెట్ కొట్టేస్తారా? తెలంగాణ టీడీపీలో కదలికలు మొదలైన తరుణంలో ఆ పార్టీ తరపున బరిలోకి దిగుతారా లేక ఇండిపెండెంటుగా ఎన్నికలను ఎదుర్కొంటారా అన్నది ఆసక్తి రేపుతోంది. ఈ సందర్భంగా ఆయన ఎలాంటి కామెంట్లు చేయనప్పటికీ ఆయన కదలికలు మాత్రం రాజకీయంగా ఆయన ఏదో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా సూచనలు ఇచ్చాయి.

Recent

- Advertisment -spot_img