Homeతెలంగాణకేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్‌

కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్‌

Hyderabad MP Asaduddin Owaisi said the Modi government at the Center was in danger of turning Hyderabad into a union territory in the future.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భవిష్యత్తులో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు.

ఆ కథనం ప్రకారం.. జమ్మూకశ్మీర్‌ విభజన చట్టం సవరణ బిల్లుపై శనివారం లోక్‌సభలో జరిగిన చర్చలో అసదుద్దీన్ మాట్లాడారు.

‘‘చెన్నై, బెంగళూరు, ముంబయి, అహ్మదాబాద్‌, లఖ్‌నవూలనూ కేంద్రపాలిత ప్రాంతాలు (యూటీలు)గా మార్చేస్తారు. ఇదే బీజేపీ విధానం. అందులో భాగంగానే కశ్మీర్‌ను ఒక ఉదాహరణగా మార్చారు’’ అని అన్నారు.

‘‘ఇప్పుడు దీన్ని చూసి కరతాళ ధ్వనులు చేసే సెక్యులర్‌గా చెప్పుకొనే కొన్ని పార్టీల వారు భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలను యూటీలుగా మార్చినప్పుడు గగ్గోలు పెట్టడం ఖాయం. ప్రభుత్వానికి మద్దతిచ్చే పార్టీలు అప్పటి పరిణామాలకు సిద్ధంగా ఉండాలి’’ అని ఒవైసీ హెచ్చరించారు.

‘‘జమ్మూకశ్మీర్‌ సమస్యను అంతర్జాతీయం చేయడం తప్పు. దీనివల్ల అక్కడి ప్రజల్లో మరింత అసంతృప్తి పెరుగుతుంది. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేటప్పుడు సాధ్యమైనంత త్వరలో రాష్ట్ర హోదా కల్పిస్తామన్న వాగ్దానం నుంచి కేంద్రం వెనక్కు తగ్గుతోంది’’ అని ఆయన విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వ వైఖరితో రాజ్యసభలో ఒక్క కశ్మీరీ పార్లమెంటేరియన్‌ లేకుండా పోయారని మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

Recent

- Advertisment -spot_img