దేవరాజ్, సాయికృష్ణ ఇప్పటికే అరెస్ట్
నిర్మాత అశోక్‌రెడ్డినీ అరెస్ట్ చేస్తామన్న డీసీపీ
హైదరాబాద్: బుల్లితెర నటి శ్రావణి (26) ఆత్మహత్య కేసులో దేవరాజ్, సాయికృష్ణతో పాటు సినీ నిర్మాత అశోక్‌రెడ్డినీ నిందితులుగా గుర్తించినట్టు వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. దేవరాజ్, సాయికృష్ణ ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరిని త్వరలోనే న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. మరో నిందితుడు అశోక్‌రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపుతామన్నారు.
ఆ బాధ భరించలేకే.. ఆత్మహత్య
ఈ ముగ్గురూ శ్రావణిని ఏదో ఒక సందర్భంలో పెళ్లి చేసుకుంటామని చెప్పారని.. ఆ తర్వాత పలు విధాలుగా ఆమెను వేధించారని తెలిపారు. ఈ బాధ భరించలేకే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామని డీసీపీ వివరించారు.ఈ కేసులో శ్రావణి తల్లిదండ్రులను నిందితులుగా చేర్చడానికి కుదరదని ఆయన స్పష్టం చేశారు. అరెస్ట్ చేసిన దేవరాజ్, సాయికృష్ణలను పోలీసులు త్వరలోఇప్పటికే నిందితులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా వారికి నెగెటివ్‌గా తేలింది. మరోవైపు శ్రావణి తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు.