Homeఅంతర్జాతీయంTWITTER :సూపర్ యాప్ గా ట్విట్టర్

TWITTER :సూపర్ యాప్ గా ట్విట్టర్

సూపర్ యాప్ గా ట్విట్టర్

  • అందుకే పేరు మార్చాం..
  • త్వరలో యాప్ మొత్తం మారుస్తాం
  • ఆర్థిక లావాదేవీలు కూడా చేసుకోవచ్చు
  • ఎలన్ మస్క్ క్లారిటీ

ఇదేనిజం, నేషనల్ బ్యూరో: ఇటీవల ఎలన్ మస్క్ ట్విట్టర్ పేరును X గా మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా పేరు ఎందుకు మార్చారన్న విషయంపై నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో అసలు పేరు ఎందుకు మార్చారన్న విషయంపై తాజాగా మస్క్ క్లారిటీ ఇచ్చారు. త్వరలో ట్విట్టర్ యాప్ ను విస్తరించబోతున్నామని ఆయన చెప్పారు. ఇక నుంచి ఆర్థిక లావాదేవీలు కూడా ట్విట్టర్ ద్వారానే చేసుకోవచ్చన్నారు. ‘వాక్‌ స్వాతంత్య్రానికి గుర్తుగా ట్విటర్‌ను మార్చాలని ఎక్స్‌ కార్పొరేషన్‌ దాన్ని కొనుగోలు చేసింది. అందులో భాగంగానే ట్విటర్‌ పేరును ఎక్స్‌గా మార్చాం. కేవలం పేరు మార్చుకోవడమే కాదు.. ఇకపై ట్విటర్‌ (ఎక్స్‌) అదే పనిచేస్తుంది. ట్వీట్‌కు 140 అక్షరాల పరిమితి ఉన్నప్పుడు ట్విటర్‌ అనే పేరు సరిపోతుంది. కానీ, ఇప్పుడు ఆ పేరు ఉండటంలో అర్థం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ట్విటర్‌ (ఎక్స్‌)లో ట్వీట్‌లు మాత్రమే కాదు పెద్ద సైజున్న వీడియోలు కూడా షేర్‌ చేయొచ్చు.’ అని మస్క్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img