Homeజిల్లా వార్తలుపుట్ట రమేష్ గౌడ్ కు నివాళులర్పించిన టీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ

పుట్ట రమేష్ గౌడ్ కు నివాళులర్పించిన టీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ

ఇదేనిజం,శేరిలింగంపల్లి: గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన శేరిలింగంపల్లికి చెందిన పుట్ట రమేష్ గౌడ్ కు టీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణరాష్ట్ర మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, టీయూడబ్ల్యుజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ లు బుధవారం నివాళులర్పించారు. శేరిలింగంపల్లికి చెందిన సీనియర్ జర్నలిస్టు, ప్రెస్ క్లబ్ మాజీ ప్రధాన కార్యదర్శి పుట్ట వినయ్ కుమార్ గౌడ్ తండ్రి పుట్ట రమేష్ గౌడ్ ఈ నెల 14వ తేదీన గుండెపోటు తో మృతి చెందిన విషయం తెలిసిందే. శోకసంద్రంలో ఉన్న వినయ్ కుమార్ కుటుంబ సభ్యులను బుధవారం అల్లం నారాయణ, ఆస్కాని మారుతిసాగర్ లు రాష్ట్ర నాయకులు ఫైళ్ల విట్టల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గంట్ల రాజిరెడ్డి, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ సాగర్ లతో కలిసి పరామర్శించారు. శేరిలింగంపల్లిలోని వినయ్ కుమార్ నివాసంలో రమేష్ గౌడ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ వినయ్ కుమార్ తండ్రి రమేష్ గౌడ్ ఆకస్మిక మరణం వారి కుటుంబానికి తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మెట్టు జగన్ రెడ్డి, టెంజు అధ్యక్షుడు పి.సాగర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కె. కిషోర్ కుమార్, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్, కార్యవర్గసభ్యులు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img