కొంతమంది యువత హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు.
పక్కన ఎవరున్నారు? ఏమనుకుంటారు? అనే భయం లేకుండా రెచ్చిపోతున్నారు.
తాజాగా బెంగళూరు మెట్రో రైల్‌లో ఓ యువతి తన ప్రియుడిని కిస్ చేస్తోన్నసమయంలో ఓ వ్యక్తి వీడియో తీశాడు.
దిల్లీ మెట్రోలాగా బెంగళూరు మెట్రో తయారవుతోందని ఆవేదనతో ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.
వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ క్లిప్స్ వైరల్ అవుతున్నాయి.
అధికారులు స్పందించి..వారి వివరాలను ఇవ్వాలని కోరారు.
వాళ్ల అనుమతి లేకుండా వీడియో తీయడం నేరమని కొందరు అంటుండగా, కొందరు ఆ జంట చేసిన పనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.