– అధికారిక సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి 2 రోజుల పాటు బంద్ కానుంది. రేపు 31(ఆదివారం), ఎల్లుండి 1(సోమవారం) రెండు రోజుల పాటు దరఖాస్తులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మళ్లీ 2 వ తేదీ నుంచి 6 వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. 28న ప్రజాపాలన ఆరు గ్యారంటీల దరఖాస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరించడం ప్రారంభించింది. అయితే రెండు సెలవు దినాలు తీసేస్తే కేవలం 8 రోజులే దరఖాస్తులు స్వీకరించినట్లవుతుంది. దీంతో తెలంగాణ ప్రజలు దరఖాస్తుల గడువు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల లబ్ధిదారుల ఎంపికంలో భాగంగా ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే.