Homeజాతీయంమహరాష్ట్రలో భూకంపం

మహరాష్ట్రలో భూకంపం

పాల్ఘర్ : మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో రెండు భూకంపాలు సంభవించాయని ఒక అధికారి శనివారం తెలిపారు. శుక్రవారం రాత్రి దాదాపు అరగంట వ్యవధిలో ప్రకంపనలు నమోదయ్యాయని ఆయన తెలిపారు. రాత్రి 11.41 గంటలకు దహను తహసీల్‌లో 4.0 తీవ్రతతో మొదటి భూకంపం సంభవించగా, 3.6 తీవ్రతతో రెండవది తలసరి తహసీల్‌లో తెల్లవారుజామున 12.05 గంటలకు నమోదైందని పాల్ఘర్ జిల్లా విపత్తు నియంత్రణ సెల్ చీఫ్ వివేకానంద్ కదమ్ తెలిపారు. భూకంపాల కారణంగా ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు లేవు. “దహను, తలాసరి తహశీల్దార్లు వారి ప్రాంతాలలో భూకంప ప్రభావాలను తెలుసుకోవడానికి ఆయా తహసీల్స్‌లో ఒక సర్వే చేయమని ఆదేశించాం” అని కదమ్ తెలిపారు. భూకంపం తరువాత ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్లి భయంతో కొంత సమయం ఉన్నారని తలసరి ప్రాంత పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. పాల్ఘర్ జిల్లా, ముఖ్యంగా దాని దహాను తలసరి తహసిల్స్ ప్రాంతంలో నవంబర్ 2018 నుండి తక్కువ నుండి మితమైన తీవ్రతతో భూకంపాలు నమోదవుతున్నాయి.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img