నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్‌బలై కార్యక్రమం జరిగింది. దత్తాత్రేయ కుటుంబం 19 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ.. తాను తెలంగాణ బిడ్డనని అన్నారు. ప్రజలంతా సోదరభావంతో మెలగాలని దత్తాత్రేయ అన్నారు.ఎందరో గవర్నర్ల రాకతో దేశం మొత్తం హైదరాబాద్ కు వచ్చిందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు.