Homeక్రైంనిర్మాణంలో ఉన్న ఇండోర్‌ స్టేడియం కూలి ఇద్దరి మృతి

నిర్మాణంలో ఉన్న ఇండోర్‌ స్టేడియం కూలి ఇద్దరి మృతి

– 12 మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
– రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​లో ఘటన

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: ఇండోర్‌ స్టేడియం కూలిపోయిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం కనకమామిడిలో సోమవారం ఈ ఘటన జరిగింది. మొయినాబాద్‌ మండలం సురంగల్‌ రెవెన్యూ పరిధిలో ఫైర్‌ఫాక్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ అకాడమీ ఆడిటోరియం నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఓ రేకుల షెడ్‌ను నిర్మించారు. సోమవారం దానిపై మరో స్లాబ్‌ వేస్తున్నారు. ఈ క్రమంలో స్లాబ్‌ కూలి షెడ్‌పై పడటంతో అక్కడ పనిచేస్తున్న కోల్‌కతాకు చెందిన బబ్లూ(35)తో మరో కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బిహార్‌కు చెందిన కార్మికులు సునీల్‌, రాకేశ్‌, సంజయ్‌, విజయ్‌, సంతోష్‌, రాజంకుమార్​తో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు కార్మికులు శిథిలాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో 14 మంది కూలీలు అక్కడ పని చేస్తున్నట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.

Recent

- Advertisment -spot_img