Homeహైదరాబాద్latest Newsనిండా పాతికేళ్లు లేవు..అప్పుడే మృత్యు ఒడిలోకి చేరారు

నిండా పాతికేళ్లు లేవు..అప్పుడే మృత్యు ఒడిలోకి చేరారు

కోరుట్ల, ఇదేనిజం : బతుకుదెరువు కోసం ట్రాక్టర్ నడుపుకుంటూ హాయిగా జీవనం సాగిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అదే ట్రాక్టర్ బలితీసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. ట్రాక్టర్‌లో మొరం తరలిస్తుండగా మల్లాపూర్ మండలం హుస్సేన్ నగర్ గ్రామ శివారులో అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. వారి కథనం ప్రకారం..ఓ మామిడితోటకు మొరం తరలిస్తుండగా మల్లాపూర్ మండలం ముత్యంపేట శివారులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడినట్లు చెప్పారు. ముత్యంపేటకు చెందిన రాజేశ్ (23), హుస్సేన్ సాగర్‌కు చెందిన షేక్ హైమద్ (20) అనే ఇద్దరు యువకులు ఈ దుర్ఘటనలో మృతి చెందినట్లు తెలిపారు. జీవితంలో కష్టసుఖాలు తెలియకుండానే..మృత్యు ఒడిలోకి చేరిన ఆ యువకులను చూసి స్థానికులు ఆవేదనకు లోనయ్యారు. బంధువుల రోదనలు చూసి చూపరుల కళ్లు చెమ్మగిల్లాయి. సంఘటనా స్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img