ఇదే నిజం, ధర్మపురి రూరల్: జగిత్యాల పట్టణంలో చికిత్స పొందుతున్న ఇద్దరు పేషేంట్లకు అత్యవసరం గా ఒకరికి (AB) పాజిటివ్ మరొకరికి (A) పాజిటివ్ అవసరం ఉందని తెలిపిన వెంటనే స్పందించి శాశ్వత రక్తదాత జగిత్యాల జిల్లా ప్రాణ దాతల సమూహం అడ్మినల్ ధర్మపురి పట్టణానికి చెందినటువంటి అబ్దుల్ రషీద్ తనతో పాటు మొట్ట మొదటి సారి రక్త దానం చేయటానికి మొహమ్మద్ ఖిజర్ వచ్చి అత్యవసర సమయంలో రక్తదానం చేయడం జరిగింది. అబ్దుల్ రషీద్ , ఖిజార్ ని పేషేంట్ బంధువులు హాస్పిటల్ సిబ్బంది బ్లడ్ బ్యాంకు సిబ్బంది తదితరులు అభినందించారు.