Homeఅంతర్జాతీయంయూఏఈ-ఇజ్రాయెల్ మధ్య ఎగిరిన తొలి కమర్షియల్ ఫ్లైట్

యూఏఈ-ఇజ్రాయెల్ మధ్య ఎగిరిన తొలి కమర్షియల్ ఫ్లైట్

టెల్ అవీవ్: ఇజ్రాయెల్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు తొలిసారి నేరుగా ఓ వాణిజ్య విమానం బయలుదేరింది. టెల్ అవీవ్ సమీపంలోని గురియన్ ఇంటర్​నేషనల్​ ఎయిర్​పోర్టు నుంచి టేకాఫ్ అయింది. ఇజ్రాయెల్‌కు చెందిన విమానయాన సంస్థ ఈఐ ఏఐ విమానం ఫ్లైట్ 971 అమెరికా-ఇజ్రాయెల్ ప్రతినిధి బృందంతో బయలుదేరింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జేరెడ్ కుష్నర్, వైట్ హౌస్ సలహాదారు ఉన్నారు. ఇజ్రాయెల్-యూఏఈ మధ్య శాంతి ఒప్పందాన్ని సూచిస్తూ అబుధాబిలో ఈ విమానం ల్యాండ్ అయ్యింది. అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు అతిథులకు సాదరంగా స్వాగతం పలికారు. శాంతి నెలకొల్పేందుకు ఇలాంటి ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తాయని ప్రతినిధులు ప్రస్తావించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img