Uber : కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉబర్ (Ube), ఓలాలకు (Ola) నోటీసులు జారీ చేసింది. ఓలా మరియు ఉబెర్ సంస్థలు ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ ఫోన్‌లను బట్టి వేర్వేరు ఛార్జీలను వసూలు చేస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి. రైడ్ బుక్ చేసుకోవడానికి ఉపయోగించే మొబైల్ పరికరాల మోడళ్లను బట్టి వేర్వేరు ధరలు వసూలు చేస్తున్నట్లు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో కేంద్రం స్పందించింది. ఈ నేపథ్యంలో, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ రెండు కంపెనీలకు నోటీసులు జారీ చేసి, ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరింది.ఒకే సేవకు రెండు వేర్వేరు ధరలను ఎలా నిర్ణయిస్తున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. చార్జీల విషయంలో నిజాయితీ, పారదర్శకత తీసుకురావడానికి సరైన వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి ఈ ధరలను Xలో పోస్ట్ చేసి, వాటిని వివిధ ధరలతో పోల్చాడు. ఈ పోస్ట్ వైరల్ అయిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.