Uber : ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ ఉబర్ (Uber) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఉబర్ ద్వారా ఆటో బుక్ చేసుకునే ప్రయాణికులు నేరుగా డ్రైవర్ కు నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రయాణికుడికి, ఆటో డ్రైవర్‌కు మధ్య జరిగే లావాదేవీల్లో తాము జోక్యం చేసుకోబోమని ఉబర్ ప్రకటించింది. ”సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్” విధానం అమలులో భాగంగా ఫిబ్రవరి 18 నుంచి ఈ కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చారు. ఆటో రైడ్‌ల నుండి ఎలాంటి కమీషన్ వసూలు చేయబోమని Uber ఒక బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది. ఈ కొత్త విధానం కింద ఉబర్ క్రెడిట్‌లు మరియు ఇతర ప్రమోషనల్ ఆఫర్‌లు వర్తించవు, అలాగే ఎటువంటి రద్దు ఛార్జీలు ఉండవు అని స్పష్టం చేయబడింది. ఇకపై ట్రిప్‌కు కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేకుండా డ్రైవర్లు ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకోవడానికి తక్కువ రుసుము చెల్లిస్తున్నారు.