ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: మెదక్ జిల్లా నర్సాపూర్, జనగామ, కామారెడ్డిలో ఘర్షణలతో ఉద్రిక్తత నెలకొంది. ఇక రాజేంద్రనగర్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. పోలింగ్ కేంద్రం సమీపంలో టేబుల్, కుర్చీలు పడేసి దుర్భాషలాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి యత్నించడంతో కలకలం రేగింది. మణికొండలోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.