గంటకు 1000 కి.మీ ప్రయాణించే అల్ట్రా హై స్పీడ్ రైలు (UHS)ను చైనా రూపొందిస్తోంది. బీజింగ్, షాంఘై మధ్య ప్రయాణించే ఈ రైలు టెస్టు రన్ విజయవంతమైంది. అయస్కాంత శక్తితో రైలు పట్టాలను తాకకుండా గాల్లో తేలుతూ ప్రయాణిస్తుంది. ఇది అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగంగా నడిచే రైలుగా నిలువనుంది.