ఐపీఎల్ 2024 లో భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నామని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. తమకు ఈ పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదన్నారు. ఏదేమైనా ఈ ఓటమిని అంగీకరించక తప్పదన్న శ్రేయస్.. టోర్నీ మధ్యలో ఇలాంటి అనుభవం ఎదురుకావడం ఒక రకంగా మంచిదైందని పేర్కొన్నారు. లోపాలు సరిచేసుకుని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగే వీలుంటుందన్నారు.