Homeహైదరాబాద్latest Newsశాంతి భద్రతలను కాపాడలేకపోతున్నారు.. సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్..!

శాంతి భద్రతలను కాపాడలేకపోతున్నారు.. సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్..!

సీఎం రేవంత్ రెడ్డి శాంతిభద్రతలను కాపాడలేకపోతున్నారని కేటీఆర్ విమర్శించారు. పోలీసుల సహకారంతో గుండాలను పంపి ఎమ్మెల్యే కౌశిక్ ఇంటిపై దాడి చేయించారని ఆరోపించారు. ఈ దాడికి సహకరించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మొన్నటి వరకు పార్టీ మారానని చెప్పిన అరికెపూడి గాంధీ, ఫిరాయింపులపై కోర్టు తీర్పు రాగానే బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ మాట మార్చారని ఎద్దేవా చేశారు. ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని ప్రశ్నించినందుకు దాడి చేస్తారా? అని మండిపడ్డారు.

Recent

- Advertisment -spot_img