Homeహైదరాబాద్latest Newsప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు మారని జిల్లా పేరు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు మారని జిల్లా పేరు

ఇదే నిజం, ముస్తాబాద్: మండలం ఇందిరమ్మ కాలనీలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ పర్యవేక్షణ లోపంతో నిరాదరణకు గురవుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం పై రాసిన బోర్డింగు లో జిల్లా పేరు కరీంనగర్ అని రాసి ఉంది. కరీంనగర్ జిల్లా నుండి వెలువడి ప్రత్యేక జిల్లాగా రాజన్న సిరిసిల్ల అని ఉండవలసినది. ఇంకా కరీంనగర్ జిల్లా గానే ఉంది. పర్యవేక్షణా లోపంతో కిటికీల అద్దాలు పగిలిపోయి ఆరోగ్య కేంద్ర పరిసరాలు పిచ్చి మొక్కలతో పాలిథిన్ కవర్లు చెత్త కాగితాలతో అపరిశుభ్రంగా ఉంది. గేటుకు తాళం వేయకపోవడంతో బయట పరిసరాలు కుక్కలకు నివాసంగా మారింది. పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యం గురించి చెప్పే వైద్యులే వైద్య కేంద్రం ముందు ఇలా ఉండడం పై విమర్శలకు తావునిస్తుంది ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని ఆరోగ్య కేంద్ర పరిసరాల ప్రాంతంలో శుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img