Homeహైదరాబాద్latest Newsసహకార బ్యాంక్‌ రుణాలపై అవగాహన

సహకార బ్యాంక్‌ రుణాలపై అవగాహన

ఇదేనిజం, కంగ్టి: సిర్గాపూర్ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ రవీందర్ ఆధ్వర్యంలో గురువారం కంగ్టి మండల కేంద్రంలో కేంద్ర సహకార బ్యాంకు రుణాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ రవీందర్ మాట్లాడుతూ.. ఈ బ్యాంకు ద్వారా వివిధారకల రుణాలు ఇస్తున్నామని తెలిపారు. కెసిసి ద్వారా రుణాలు , దీర్ఘకాలిక రుణాలు ఇస్తుందని తెలిపారు. కాల పరిమితి 10 ఏళ్లు ఉంటుందన్నారు. డ్వాక్రా రుణాలు, గోల్డ్‌ లోన్లు , విద్య , వాహన , గృహ రుణాలు ఇస్తున్నట్టు తెలిపారు. రికరింగ్ డిపాజిట్ సస్కీం లో చేరండి లక్షాధికారి కండి , అదేవిధంగా డిపాజిట్ల పై అధిక వడ్డీ ఇస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ మారుతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img