unemployed: కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు మరో సంతోషకరమైన వార్త అందించేందుకు సిద్ధమవుతోంది. త్వరలో 18 ఉద్యోగ నోటిఫికేషన్‌లను విడుదల చేయాలని యోచిస్తోంది. ఏపీపీఎస్సీ ద్వారా ఖాళీల భర్తీకి ఇప్పటికే ఖాళీలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎస్సీ వర్గీకరణ ఆధారంగా శాఖల వారీగా రోస్టర్ పాయింట్‌లను ఖరారు చేశారు. దీంతో, నెల రోజుల్లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌లు జారీ కానున్నాయి. ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.