Homeహైదరాబాద్latest News'పుష్ప 2' మూవీకి ఊహించని షాక్.. బాయ్ కాట్ అంటూ ట్రేండింగ్

‘పుష్ప 2’ మూవీకి ఊహించని షాక్.. బాయ్ కాట్ అంటూ ట్రేండింగ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ‘పుష్ప 2: ది రూల్’. ఈ సినిమాలో రష్మిక హీరోయినిగా నటించింది. ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉండగా విడుదలకు ముందే ఈ మూవీకి ఊహించని షాక్ తగులుతుంది. ఈ సినిమాని కన్నడలో బాయ్ కాట్ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు కన్నడ అభిమానులు. కన్నడ హీరో శ్రీ మురళి నటించిన ‘బగీరా’ ​​తెలుగులో దీపావళి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. కానీ తెలుగులో తమ హీరో సినిమాకు థియేటర్లు చాలా తక్కువ ఇచ్చారు. అయితే ఇప్పుడు శ్రీ మురళీ ఫ్యాన్స్ కాస్త తగ్గడంతో చాలా హర్ట్ అయ్యారు. దీంతో అల్లు అర్జున్ సినిమాను కన్నడలో బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img