Homeహైదరాబాద్latest Newsసత్యరాజ్ జీవితంలో ఊహించని విషాదం.. అన్ని సంవత్సరాలు కోమాలో ఎవరున్నారు..?

సత్యరాజ్ జీవితంలో ఊహించని విషాదం.. అన్ని సంవత్సరాలు కోమాలో ఎవరున్నారు..?

తమిళ నటుడు సత్యరాజ్ ప్రతినాయక పాత్రలతో తన ప్రస్థానం ప్రారంభించి నాయకుడి పాత్రలు, సహాయకుడి పాత్రలు పోషించాడు. 200కి పైగా సినిమాల్లో నటించాడు. ఇందులో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలున్నాయి. తెలుగులో బాహుబలి, మిర్చి, శంఖం లాంటి సినిమాల్లో నటించాడు. సత్యరాజ్‌కు భార్య మహేశ్వరి మరియు ఇద్దరు పిల్లలు సిపి మరియు దివ్య ఉన్నారు. సత్యరాజ్ వ్యక్తిగత జీవితంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సత్యరాజ్ భార్య అనారోగ్యంతో బాధపడుతోంది. గత నాలుగేళ్లుగా ఆమె కోమాలో ఉన్నారు.ఈ విషయాన్ని అతని కుమార్తె దివ్య ఇటీవలసోషల్ మీడియా ద్వారా తెలిపింది. దివ్య తన పోస్ట్‌లో.. మా అమ్మ గత 4 సంవత్సరాలుగా కోమాలో ఉంది, మేము ఆమెను ఇంట్లో చూసుకుంటున్నాము, మేము చాలా బాధలో ఉన్నప్పటికీ, మా అమ్మ త్వరగా కోలుకోవాలని మేము ఆశిస్తున్నాము.. ఏదో ఒకరోజు సాధారణ స్థితికి అమ్మ వస్తుంది.. నాన్న అన్నీ తానై మమ్మల్ని చూసుకుంటున్నారు అని ఆమె తెలిపింది.

Recent

- Advertisment -spot_img