హైదరాబాద్ పరిథిలోని పాఠశాలల్లో ఇకనుంచి స్కూల్ యూనిఫాం, షూ, బెల్టులను విక్రయించకూడదు. లాభాపేక్ష కోసం వీటిపేరుతో వ్యాపారం చేస్తోన్న యాజమాన్యాలను కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ మేరకు స్టేట్/ సీబీఎస్‌ఈ / ఐసీఎస్‌ఈ పాఠశాలల్లో విక్రయాలు ఉండవు. దీనికి సంబంధించి అధికారులకు హైదరాబాద్ జిల్లా డీఈఓ సర్క్యులర్ జారీ చేశారు. ఒక వేళ స్టేషనరీ అమ్మాల్సి వస్తే నాన్ ప్రాఫిట్ కింద మాత్రమే అమ్మాలని నిర్ణయించారు.