కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలు, సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి ఘటనతో హైదరాబాద్ అట్టుడుకుతోందని అన్నారు .నిన్న సికింద్రాబాద్‌లో వీహెచ్‌పీ కార్యకర్తలపై విచక్షణా రహితంగా లాఠీచార్జి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే వారు ఉగ్రవాదులను కొట్టినట్లేనని విమర్శించారు. నగరంలో అనేక హిందువుల పండుగలను నిషేధించారని, కనీసం నిరసన తెలిపే హక్కు కూడా వారికి లేదా? కిషన్ రెడ్డి మండిపడ్డారు. హిందువులపై ఎందుకు వివక్ష? అని ధ్వజమెత్తారు.