Homeహైదరాబాద్latest Newsకేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నా పోలీసులు

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నా పోలీసులు

హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చారు. పోలీసులు బండి సంజయ్‌ను అరెస్టు చేశారు. నిన్న గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. వారిని పరామర్శించేందుకు బండి సంజయ్ అశోక్ నగర్ వెళ్లారు. ఆ తరువాత చలో సచివాలయానికి పిలుపునిచ్చారు. గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి సచివాలయానికి ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు ర్యాలీని ఆపడంతో బండి సంజయ్ వారితో వాగ్వాదానికి దిగారు. సచివాలయానికి వెళ్తామని స్పష్టం చేశారు. అయితే వెళ్లే దారి మధ్యలోనే పోలీసులు బండి సంజయ్‌ను అరెస్టు చేశారు.

Recent

- Advertisment -spot_img