న్యూఢిల్లీ: యూనైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్(యూఎన్ఓ) వేదికపై జమ్మూ కశ్మీర్ అంశాన్ని లేవదీసినా టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగన్‌కు ఇండియా దిమ్మతిరిగే సమాధానం చెప్పింది. ‘ఇతర దేశాల వ్యవహారాల్లో తలదూర్చడం మాని.. మీ దేశ అంతర్గత విషయాలపై దృష్టి పెడితే బాగుంటుదని’ గట్టిగా సూచించింది. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం నేర్చుకోవాలని టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగన్‌కు హితవు చెప్పింది.ఈ మేరకు యూఎన్ఓలో ఇండియా ప్రతినిధి తిరుమూర్తి పేర్కొన్నారు.
యూఎన్ఓ సర్వప్రతినిధి సభ 74వ యాన్యువల్ మీటింగ్‌లో టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగన్ వీడియో సందేశాన్ని వినిపించార. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. 2019లోనూ ఎర్డోగన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి భారత్ ఆగ్రహానికి గురయ్యారు.