టీ20ల్లో తిలక్ వర్మ అదరగొట్టేస్తున్నాడు. ఇటీవలే దక్షిణాఫ్రికాపై రెండు సెంచరీలు బాదిన అతడు..మరో శతకం చేశాడు. అయితే ఇది దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలో. దీంతో టీ20ల్లో వరుసగా 3సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా తిలక్ రికార్డు సృష్టించాడు. హైదరాబాద్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన తిలక్ ప్రత్యర్థి జట్టు మేఘాలయపై 151 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం సాధించింది.