Homeహైదరాబాద్latest NewsUP : అత్యాచారం చేశాడంటూ తప్పుడు కేసు పెట్టినందుకు మహిళకు నాలుగేళ్ల జైలు శిక్ష

UP : అత్యాచారం చేశాడంటూ తప్పుడు కేసు పెట్టినందుకు మహిళకు నాలుగేళ్ల జైలు శిక్ష

తప్పుడు కేసు పెట్టినందుకు ఉత్తరప్రదేశ్‌లో ఓ యువతికి జైలుశిక్ష విధించింది అక్కడి కోర్టు. మత్తు పదార్థాలు ఇచ్చి తన కూతురుపై అత్యాచారం చేశాడంటూ అజయ్ అనే వ్యక్తిపై 2019 డిసెంబర్ 2న ఫిర్యాదు చేయగా..అప్పటి నుంచి అతను జైల్లోనే ఉన్నాడు. తాజాగా కేసు విచారణలో బాలిక నిజం ఒప్పుకుంది. తనపై అత్యాచారం చేయలేదంటూ కోర్టు ముందు పశ్చాత్తాపపడింది. దీంతో అజయ్‌ను నిర్దోశిగా ప్రకటిస్తూ అడిషనల్ సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. అజయ్ జైలుశిక్ష అనుభవించినన్ని రోజులు..అంటే 4 సంవత్సరాల 6 నెలల 13 రోజులు జైలుశిక్షతో పాటు రూ.5,88,822 జరిమానా విధించింది. తప్పుడు కేసు పెట్టి..యువకుడి జీవితాన్ని నాశనం చేసిన బాలిక తల్లిపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.

Recent

- Advertisment -spot_img