కొన్ని యూపీఐ లావాదేవీలకు ఒకేసారి రూ. 5లక్షల వరకు చెల్లింపులు జరిపేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అనుమతినిచ్చింది. అయితే ఈ విధానం రేపటి (సెప్టెంబర్ 15) నుంచి అమల్లోకి రానుంది. ఆగస్టు ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ‘యూపీఐతో పన్ను చెల్లింపు పరిమితిని రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచాలి’ అని ఆర్‌బీఐ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా NPCI ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ఆసుపత్రి, విద్యా సంస్థల బిల్లులను ఇదే పద్ధతిలో చెల్లించొచ్చు.