Homeహైదరాబాద్latest Newsరేపటి నుంచి UPI సేవలు బంద్.. ఈ నంబర్లకు పై ప్రభావం..!

రేపటి నుంచి UPI సేవలు బంద్.. ఈ నంబర్లకు పై ప్రభావం..!

ఇన్ యాక్టీవ్ లేదా వేరే వారికి కేటాయించిన మొబైల్ నంబర్లకు ఏప్రిల్ 1 నుంచి UPI సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు బ్యాంకులు, పేమెంట్ సేవలందించే ప్రొవైడర్లకు.. NPCI ఆదేశాలు జారీ చేసింది. ఎక్కువకాలం పాటు వినియోగంలో లేని మొబైల్ నంబర్లను టెలికాం కంపెనీలు వేరొకరికి కేటాయిస్తుంటాయి. దీంతో దీర్ఘకాలం పాటు మనం వాడే నంబర్లు వేరొకరికి చేరుతుంటాయి. మన యూపీఐ ఖాతాలతో అనధికారిక, మోసపూరిత లావాదేవీలు జరిగే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • మొబైల్ నంబర్ మార్చినా బ్యాంకుల వద్ద ఆ నంబర్‌ను అప్డేట్ చేయని వారి మీద ప్రభావం ఉంటుంది.
  • యూపీఐతో లింక్ చేసి కాల్స్, SMSలు వంటివేవీ చేయకుండా దీర్ఘకాలం పక్కన పెట్టిన వారు
  • బ్యాంకు వివరాలను అప్‌డేట్ చేయకుండా మొబైల్ నంబర్‌ను సరెండర్ చేసినవారు అవాంతరాలు ఎదుర్కొంటారు.
  • పాత నంబర్‌ను వేరొకరికి అసైన్ చేసిన సందర్భాల్లో పాత నంబర్ హోల్డర్లపై ఈ ప్రభావం ఉంటుంది.

Recent

- Advertisment -spot_img