Mukhtar Ansari death: ఉత్తర ప్రదేశ్‌లో ప్రముఖ గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ కన్నుమూశారు. గురువారం సాయంత్రం బాందా జైలులో గుండెపోటుతో మృతి చెందారు. చనిపోవడానికి కొన్ని రోజుల ముందు నుంచే ఆయన అనారోగ్యంతో ఉంటున్నారు. అనారోగ్యం కారణంగా ఆయనను పలుమార్లు జైలు నుంచి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు యూపీలో హై అలర్ఠ్ ప్రకటించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. 1997 నుంచి 2022 వరకు మౌ అసెంబ్లీ స్థానానికి ఆయన ప్రాతినిధ్యం వహించారు.