Homeహైదరాబాద్latest NewsUPSC 2024 సివిల్స్ ఫలితాలు విడుదల.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..!!

UPSC 2024 సివిల్స్ ఫలితాలు విడుదల.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..!!

UPSC Results : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 తుది ఫలితాలు ఏప్రిల్ 22న విడుదలయ్యాయి. ఫలితాలను మంగళవారం మధ్యాహ్నం UPSC విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా మంది విద్యార్థులు ఈ ఫలితాల్లో తమ ప్రతిభను చూపించారు. ఇందులో శక్తి దూబేకు మొదటి ర్యాంకు లభించింది. హర్షిత గోయల్ రెండు ర్యాంకు వచ్చింది. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తెలుగు అభ్యర్థి సాయి శివానికి 11వ ర్యాంకు, బన్నా వెంకటేశ్‌కు 15వ ర్యాంకు,అభిషేక్ శర్మ 38, రావుల జయసింహారెడ్డి 46, శ్రవణ్ కుమార్ రెడ్డి 62,చైతన్య జాదవ్ 68 , ఎన్ చేతనరెడ్డి 110, చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డి 119 ర్యాంకులు సాధించారు. అభ్యర్థులు అధికారిక యూపీఎస్సీ వెబ్‌సైట్ upsc.gov.inలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

UPSC టాప్ 10 : 1.శక్తి దుబే, 2. హర్షిత గోయెల్‌, 3. డోంగ్రే అర్చిత్‌ పరాగ్‌, 4. షా మార్గి చిరాగ్‌, 5. ఆకాశ్‌ గార్గ్‌, 6. కోమల్‌ పూనియా, 7. ఆయుషి బన్సల్‌, 8. రాజ్‌కృష్ణ ఝా, 9. ఆదిత్య విక్రమ్‌ అగర్వాల్‌, 10. మయాంక్‌ త్రిపాఠి

గత ఏడాది ఫిబ్రవరిలో, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో వెయ్యికి పైగా IAS, IPS మరియు IFS పోస్టుల నియామకానికి UPSC నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 16న UPSC ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. ఆ తర్వాత ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 20 నుండి 29 వరకు మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి జనవరి 7 నుండి ఏప్రిల్ 17 వరకు దశలవారీగా వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించి, ఇటీవలే తుది ఫలితాలను ప్రకటించారు. మొత్తం 1,056 పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ ఇవ్వగా, 1,009 మంది క్వాలిఫై అయ్యారని UPSC వెల్లడించింది.

Recent

- Advertisment -spot_img