యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నలుగురు వెయ్యిలోపు ర్యాంకులను సాధించి సత్తా చాటారు. హనుమకొండ జిల్లాకు చెందిన జై సింహారెడ్డి 104 ర్యాంక్ సాధించగా, వరంగల్ జిల్లా గీసుకొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన కిరణ్ 568 ర్యాంక్ సాధించారు. జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన ప్రణయ్ 554 ర్యాంకును సొంతం చేసుకోగా, వరంగల్ జిల్లా శివనగర్‌కు చెందిన అనిల్ 764 కైవసం చేసుకున్నారు.
మూపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటిగా ఉంటుంది. అభ్యర్థి వ్యక్తిత్వాన్ని, తెలివిని, భవిష్యత్ తరాలకు అందించే సేవలు, ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్‌లో తలెత్తే సమస్యలు, తదితర అంశాలపై క్షుణ్ణంగా పరీక్షించి ఎంపిక చేస్తారు. దేశాభివద్ధిలో సివిల్స్ అధికారుల పాత్ర ఎనలేనిది.