Homeహైదరాబాద్latest Newsఅర్జంట్ అయితే బయటే.. 129 129 మంది విద్యార్థులకు ఒక్కే ఒక్క మరుగుదొడ్డి..!

అర్జంట్ అయితే బయటే.. 129 129 మంది విద్యార్థులకు ఒక్కే ఒక్క మరుగుదొడ్డి..!

ఇదేనిజం, రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని అల్లిపూర్ లోని ప్రాథమిక పాఠశాల లో మౌలిక వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. 129 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో 65మంది బాలికలు 64మంది బాలురు ఉండగా వీరందరికి ఒక్కటంటే ఒక్కటే మరుగు దొడ్డి ఉండడంతో అర్జంట్ అయితే బాల బాలికలు దానినే ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా నిత్యం ఇంటర్వెల్ సమయంలో బాలికలు ఒకరి తర్వాత ఒకరు టాయిలెట్స్ కోసం క్యూ లైన్ లో వెళ్లాల్సిన పరిస్థితి ఇదే పాఠశాలలో చదువుతున్న బాలురు అయి తే మూత్ర విసర్జన కోసం ఆరుబయట కు వెళ్తున్నారు. మరోవైపు పాఠశాలలో బెంచీలు లేకపోవడంతో నేలపైనే విద్యార్థు లు కూర్చుంటుంటున్నారు. ఒక్కో గదిలో రెండు తరగతుల చొప్పున రెండు గదుల్లో క్లాసులు నడిపిస్తుండగా మూడో గదిని సైతం క్లాస్ తో పాటు ఆఫీస్ రూమ్, స్టోర్ రూమ్ గా వాడుతున్నారు. పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని గ్రామస్తులతో పాటు విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై హెడ్మాస్టర్ శ్రీనివాస్ ను వివరణ కోరగా ఇటీవలే పాఠశాలకు బదిలీపై వచ్చానని తెలిపాడు

Recent

- Advertisment -spot_img