HomeతెలంగాణUrgent call from Delhi to Kishan Reddy కిషన్​ రెడ్డికి ఢిల్లీ నుంచి అర్జెంట్​...

Urgent call from Delhi to Kishan Reddy కిషన్​ రెడ్డికి ఢిల్లీ నుంచి అర్జెంట్​ కాల్​

– హుటాహుటిన బయలుదేరిన బీజేపీ స్టేట్​ చీఫ్​
– అసెంబ్లీ ఎన్నికలపై కీలక చర్చలు?

ఇదేనిజం, నేషనల్​ బ్యూరో: కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్​ రెడ్డికి బీజేపీ హైకమాండ్​ నుంచి అర్జెంట్​ కాల్​ వచ్చింది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇటీవల ప్రధాని మోడీ వరస పర్యటనలు, రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై కిషన్​ రెడ్డితో కేంద్ర పెద్దలు చర్చించబోతున్నట్టు సమాచారం. కేంద్ర హోమంత్రి అమిత్​ షాతో కిషన్​ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నట్టు సమాచారం. ఇటీవల ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా పసుపుబోర్డు, గిరిజన వర్సిటీపై హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలో జరగబోయో కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ అంశాలు ఉన్నట్టు సమాచారం. దీంతో కిషన్​ రెడ్డి ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకున్నది.

Recent

- Advertisment -spot_img