US CONSULATE:
US CONSULATE:హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లోని నానక్‌రామ్‌గూడలో యూఎస్ కాన్సులేట్ కొత్త భవనం మార్చి 20న ప్రారంభమైంది. ఒకటిన్నర దశాబ్దాలుగా బేగంపేట పైగా ప్యాలెస్‌లో సేవలందించిన యూఎస్ కాన్సులేట్ ఇకపై కొత్త క్యాంపస్ నుంచి అందిస్తున్నారు. అత్యాధునిక సదుపాయాలతో ఈ భవనాన్ని నిర్మించారు. వీసాకు సంబంధించిన ఇంటర్వ్యూలు మాత్రం నానక్‌రామ్‌గూడలోని యూఎస్ కాన్సులేట్ భవనంలో ఉంటాయని కాన్సులేట్ జనరల్ సూచించింది. బయోమెట్రిక్ అపాయింట్‌మెంట్‌లు, డ్రాప్‌బాక్స్, పాస్‌పోర్ట్ పికప్‌తో సహా ఇతర వీసా సేవలు మాదాపూర్‌లోని హైటెక్‌సిటీ మెట్రోస్టేషన్‌లోని దిగువ కాన్‌కోర్స్‌లో ఉన్న వీసా అప్లికేషన్ సెంటర్‌లో కొనసాగుతాయి.
నానక్‌రామ్‌గూడలోని యూనెటైడ్ స్టేట్స్ కాన్సులేట్ జనరల్ తెలంగాణ, ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన పౌరులకు సేవలు అందిస్తుంది. అమెరికా-భారత్ మధ్య ధ్వైపాక్షిక సంబంధాలను ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వ అధికారులు, వ్యాపార, వాణిజ్య, సాధారణ ప్రజలకు దౌత్య, సాంస్కృతిక సంబంధాల కోసం కాన్సులేట్ పనిచేస్తుంది. ఇక్కడి నుంచి యూఎస్ వెళ్లాలనుకునే పౌరులకోసం అధికారిక, పర్యాటకం, వ్యాపారం, విద్యా ప్రయోజనాల కోసం వెళ్లే వారికి వీసా సేవలను అందిస్తుంది.
హైదరాబాద్‌లోని ఈ సరికొత్త కాన్సులేట్ భవనం కోసం అమెరికా 340 మిలియన్ డాలర్ల ఖర్చు చేసింది. ఓ కార్పొరేట్ కంపెనీల లుక్ వచ్చేలా దీన్ని డిజైన్ చేశారు. ఇలాంటి కాన్సులేట్ భవనం ప్రపంచంలో ఎక్కడా లేదని చెబుతున్నారు అమెరికన్ ఇంజనీర్లు. హైదరాబాద్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ కావడంతో.. ఇక్కడ భారీ స్థాయిలో సౌత్ ఆసియాలోనే అతిపెద్ద కాన్సులేట్ భవనాన్ని నెలకొల్పామంటున్నారు కాన్సులేట్ అధికారులు. అంతేకాదు అమెరికా – భారత్‌ల మధ్య బలపడుతోన్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిదర్శనమని అధికారులు తెలిపారు.