Homeఅంతర్జాతీయంChina’s Hypersonic Missile : చైనా క్షిపణి పరీక్షలు జరిగినట్లుగా ధ్రువీకరించిన‌ అమెరికా

China’s Hypersonic Missile : చైనా క్షిపణి పరీక్షలు జరిగినట్లుగా ధ్రువీకరించిన‌ అమెరికా

USA confirms China’s Hypersonic Missile test : చైనా క్షిపణి పరీక్షలు జరిగినట్లుగా ధ్రువీకరించిన‌ అమెరికా..

చైనా ఇటీవల హైపర్‌సోనిక్‌ క్షిపణిని ప్రయోగించింది. ఆ పరీక్ష విజయవంతం కాలేదు.

అప్పట్లో ఆ పరీక్షలను అమెరికా రక్షణ వ్యవస్థ గుర్తించలేకపోయింది.

అయితే, తొలిసారిగా క్షిపణి పరీక్షలు జరిగినట్లుగా అమెరికా ధ్రువీకరించింది.

ఇది స్పుత్నిక్ ఉపగ్రహం ప్రయోగం వంటి క్షణాలుగా అమెరికా చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ చైర్మన్‌ మార్క్ మిల్లీ అభివర్ణించారు.

ఇది చాలా ముఖ్యమైన సాంకేతిక కార్యక్రమమని, దీనిపై పూర్తి శ్రద్ధ పెట్టినట్లు బ్లూమ్‌బెర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మార్క్‌ మిల్లీ చెప్పారు.

ఇలాంటి క్షిపణి పరీక్షలు జరుపడం చాలా ఆందోళనకరమన్నారు.

సోవియట్ యూనియన్ 1957లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఉపగ్రహం స్పుత్నిక్‌ని ప్రయోగించి ఆశ్చర్యపరిచింది.

దీని తర్వాత ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల మధ్య అంతరిక్ష పోటీ మొదలైంది.

వాస్తవానికి ఈ ఏడాది ఆగస్టులో చైనా అణు సామర్థ్యం గల హైపర్‌సోనిక్ క్షిపణిని పరీక్షించింది.

ఈ వార్త అక్టోబరు 16న బయటకు వచ్చింది. మీడియా వార్తల ప్రకారం, చైనా హైపర్‌సోనిక్ క్షిపణి తన లక్ష్యాన్ని చేధించడంలో విఫలమైంది.

అయితే, చైనా ఈ ప్రయత్నంతో అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను మాత్రం ఆశ్చర్యపరిచేలా చేయగలిగింది.

ఇంతకుముందు అమెరికా ఈ పరీక్షను ధ్రువీకరించలేదు. ఇన్నిరోజుల తర్వాత పరీక్షలు జరిగినట్లు అంగీకరించింది.

బ్రిటీష్ వార్తాపత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్‌ ప్రకారం, చైనా మిలిటరీ ప్రయోగించిన లాంగ్ మార్చ్ రాకెట్, హైపర్‌సోనిక్ గ్లైడ్ వాహనాన్ని మోసుకెళ్లింది.

ఇది అంతరిక్షంలోని తక్కువ కక్ష్యకు చేరుకున్న తర్వాత భూమిని చుట్టుముట్టి లక్ష్యం వైపు వేగంగా కదిలింది.

అయితే, లక్ష్యానికి దాదాపు 32 కిలోమీటర్ల దూరంలో పడిపోయింది. చైనా ఈ పరీక్షను గోప్యంగా ఉంచింది.

Recent

- Advertisment -spot_img