Homeజిల్లా వార్తలుజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ సేవలను సద్వినియోగపరచుకోవాలి

జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ సేవలను సద్వినియోగపరచుకోవాలి

ఇదేనిజం, నల్లబెల్లి: నల్లబెల్లి మండల కేంద్రంలో ఇటీవలే నూతనంగా ప్రారంభమైన వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ సేవలను మండల ప్రజలు రైతులు సద్వినియోగపరచుకోవాలని సంబంధిత నోడల్ అధికారి స్రవంతి కోరారు. మండల కేంద్రంలోని బ్యాంకును సోమవారం ఆమె పరిశీలించారు. అనంతరం రికార్డుల తనిఖీ చేపట్టి మండలంలో రైతులు వ్యాపారాలకు సంబంధించిన విషయాలను స్థానిక బ్యాంకు మేనేజర్ కత్తుల నరేందర్ తో పాటు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటు చేసుకున్న సహకార బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ లతో పాటు ఖాతాదారుల సంఖ్య పెంచుకునే విధంగా ప్రజలు సహకరించాలని ఆమె పేర్కొన్నారు. నూతన ఖాతాలు తెలుసుకునేందుకు బ్యాంకులో అవకాశం ఉన్నందున విరివిగా బ్యాంకు ఖాతాలను తెరవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో స్థానిక బ్యాంకు మేనేజర్ సిబ్బంది పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img